TG: హెచ్పీసీఎల్కు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో లేఖ రాశారు. యాదాద్రి ఆలయానికి గ్యాస్ సరఫరా ఆపొద్దని విజ్ఞప్తి చేసింది. దీనిపై HPCLసానుకూలంగా స్పందించింది. ప్రతి నెలా మూడున్నర టన్నులు గ్యాస్ వినియోగిస్తున్నట్లు తెలిపింది. రెండు నెలలకు సరిపడా గ్యాస్ దేవస్థానంలో అందుబాటులో ఉందని పేర్కొంది. కాగా, గల్ఫ్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఎర్పడిన సంగతి తెలిసిందే.