మహాకుంభమేళాతో ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకోవడంపై దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాహం ముమ్మాటికీ లవ్ జీహాద్‌లో భాగమేనని ఆరోపించాడు. ఆమెను మోసం చేసి ఈ పెళ్లి చేసుకునేలా చేశారని మండిపడ్డాడు. మోనాలిసా జీవితాన్ని మార్చడానికే ఆమెకు శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకువచ్చినట్లు చెప్పాడు. కానీ ఆమె వివాహం చాలా బాధించిందని తెలిపాడు.