ప్రస్తుతం ప్రేమలో ముందు అమ్మాయిలే పడుతున్నారని.. వారే ప్రపోజ్ చేస్తున్నాని ఓ సర్వేలో తేలింది. నిజానికి ప్రపోజల్ అనేది సాంప్రదాయకంగా పురుషుల బాధ్యతగా భావించబడుతూ వచ్చింది. కానీ ఇటీవల అది మారుతోంది. మహిళలు కూడా తమకు నచ్చిన వ్యక్తులకు ప్రపోజ్ చేస్తున్నారు. ఈ మార్పు లవ్ & కమిట్మెంట్ను వ్యక్త పరచడంలో మహిళల ఆత్మ విశ్వాసాన్ని, స్వేచ్ఛను సూచిస్తుందని చెబుతున్నారు.