VZM: గత నెల 28న రావివలసలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రజా వేదికలో తల్లిదండ్రులు లేని విషయాన్ని అక్క చెల్లెలు రేగిడి హారిక, అఖిల సీఎంకు తెలియజేశారు. పీ-4 ద్వారా సీఎం ఇరువురికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను మంజూరు చేశారు. వాటిని బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు చేతులు మీదగా అందజేశారు.