VKB: మోమిన్‌పేట్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ జీ.వెంకట్ సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లకు కీలక సూచనలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్, రూమర్స్, మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. చట్ట విరుద్ధమైన సందేశాలు వస్తే వెంటనే తొలగించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటమని చెప్పారు.