కర్నూలు నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్యను 52 నుంచి 68కు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా ఆధారంగా పరిపాలన సౌలభ్యం, ప్రజా ప్రాతినిధ్యం పెంపే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన డివిజన్లతో నగర శివారు ప్రాంతాలకు మెరుగైన అభివృద్ధి, నిధుల కేటాయింపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.