MDK: నిజాంపేట మండలవ్యాప్తంగా గురువారం అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజీరెడ్డి తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ సభలు జరుగుతాయని పేర్కొన్నారు. పంచాయతీల పరిధిలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు.