భారత్-పాకిస్తాన్ సరిహద్దులో హెరాయిన్ కలకలం సృష్టించింది. జమ్మూలో డ్రోన్ ద్వారా జారవిడిచిన హెరాయిన్ లభ్యమైనట్లు తెలుస్తోంది. కొరోటానా ఖుర్ద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జారిపడిన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.