నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ‘నీలిర’ సినిమా ఈవెంట్లో హీరో రానా సందడి చేశాడు. సాధారణ కమర్షియల్ చిత్రాల్లో ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం చాలా అరుదని ప్రశంసించాడు. యుద్ధం నేపథ్యంలో సాగే సినిమాలో కేవలం పోరాటాలే కాకుండా, మానవీయ కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని రానా కొనియాడాడు. ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలు టాలీవుడ్‌కు అవసరమని పేర్కొన్నాడు.