ATP: గుత్తి CSI చర్చిలో గురువారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ కో ఆర్డినేటర్ మార్షల్ మాట్లాడుతూ.. ఈ నెల 4న నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవ సోదర, సోదరీమణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.