SKLM: ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి నలుగురు పారిపోవడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకున్నాడు అని సీఐ ఎం. అవతారం తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.