GNTR: తెనాలిలోని కంపోస్ట్ యార్డును పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సూర్యదేవర హరికృష్ణ బుధవారం సాయంత్రం సందర్శించారు. కమిషనర్ రామ అప్పలనాయుడు, హెల్త్ ఆఫీసర్ ఏసుబాబుతో కలిసి కోకోనట్ యూనిట్, వర్మీ, ఆర్గానిక్ కంపోస్ట్, బయో గ్యాస్ ప్లాంట్, కుక్కల శస్త్ర చికిత్స కేంద్రాలను పరిశీలించారు. కంపోస్ట్ యార్డులో చెత్త పేరుకుపోకుండా చూడాలని అధికారులకు సూచించారు.