శ్రీకాకుళం జి.టి.రోడ్డులోని చారిత్రక జామియా మసీదులో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మసీదు అధ్యక్షుడు షేక్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. రంజాన్ మాసం పరమత సహనానికి ప్రతీక అని పేర్కొన్నారు.