HYD: అమీర్‌పేటలోని శ్రీ కనకదుర్గాదేవీ ఆలయంలో బుధవారం కుంబాభిషేకం నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఈ పూజలలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. అనంతరం శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.