NLR: విడవలూరు మండలంలో గురువారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని పార్లపల్లి పంచాయతీ నందు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకు, డ్రైన్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.