SRD: కంగ్టి మండలం గాజులపాడు గ్రామంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 90 మందికి కంటి వైద్య నిపుణులు ముదసిర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15 మందికి కంటి చూపు లోపించడంతో ఉచిత ఆపరేషన్‌కు రిఫర్ చేశారు. 50 మందికి మందులు పంపిణీ, 28 మందికి కళ్ళజోడు పంపిణీ చేసినట్లు సర్పంచ్ బిరాదార్ భీమ్ రావు తెలిపారు.