WGL: చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా MLA దొంతి మాధవరెడ్డి హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలతో సుఖసంతోషాలతో నుండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.