W.G: జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. నేడు జిల్లా వ్యాప్తంగా 2,22,354 మంది లబ్ధిదారులకు రూ.96.44 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.