BPT: బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రారంభించారు. అనంతరం కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఆటస్థలంలో చిన్నారులతో కలిసి సమయం గడిపి, వారిని ఉత్సాహపరిచారు. భవనం లోపల గోడలపై ఉన్న విద్యాపరమైన చిత్రాలను పరిశీలించి, చిన్నారులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి ముచ్చటించారు.