GDWL: బాదేపల్లి మార్కెట్ యార్డులో బుధవారం పలు పంటల గరిష్ఠ ధరలను మార్కెట్ కార్యదర్శి అశ్వక్ హైమద్ వెల్లడించారు. క్వింటాకు వేరుశనగ రూ.8021, కందులు రూ.7237, ఆముదాలు రూ.6475, సన్ఫ్లవర్ రూ.5260, వడ్లు (RNR) రూ.2479, మొక్కజొన్నకు రూ.1858 చొప్పున ధరలు లభించాయి. రైతులు తమ పంటలను నాణ్యతతో తెచ్చి మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు.