W.G: నరసాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్ గాయపడ్డాడు. కలెక్షన్ నిమిత్తం పీచుపాలెం బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని బైక్ అతడిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్లు SI జయలక్ష్మీ తెలిపారు. ఈ ప్రమాదంలో అన్నవరం కుడి కాలి మోకాలికి గాయలయ్యాయి. ఎస్సై జయలక్ష్మి కేసు నమోదు చేశారు.