SRD: సంగారెడ్డి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ నిరుద్యోగ యువత కోసం రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నైపుణ్యా భివృద్ధి, ప్రేరణ శిక్షణ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 114 మంది ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.