VSP: దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ వైరు వేలాడుతూ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా కాచిగూడ ఎక్స్ప్రెస్తో పాటు పలురైళ్లను నిలిపివేశారు. ఉదయం 6.40 నుంచి 8.30 గంటల వరకు రాకపోకలు అంతరాయం కలగగా, సాంకేతిక లోపాన్ని సరిచేసిన అనంతరం రైళ్ల సేవలను పునరుద్ధరించారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.