NLG: కనగల్ మండలం ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి అమ్మవారిని ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అష్టోత్తర కుంకుమ పూజలు విశేషంగా జరిపారు.