MLG: భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం పాలకమండలి సభ్యునిగా నియమితులైన పూజారి సురేందర్ బాబును రాష్ట్ర మంత్రి సీతక్క సన్మానించారు. ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభినందనలు తెలిపి, ఆయన సేవలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.