NGKL: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కల్వకుర్తి పట్టణానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆయన పార్టీ జిల్లా స్థాయి పదవి దక్కడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో అతన్ని పలువురు అభినందించారు.