ADB: సమాజంలో విద్యార్థులను తీర్చిదిద్దే ఘనత ఉపాధ్యాయుడికి దక్కుతుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని కుంటాల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంబారావు పదవీ విరమణ కార్యక్రమంలో MLA పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంబారావు పాఠశాలకు చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, నాయకులు తదితరులున్నారు.