NRML: సారంగాపూర్ మండలం ప్యారమూర్ గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ, అంగన్వాడీ భవనం, నర్సరీ తదితర అభివృద్ధి పనులను ఎంపీవో అజీజ్ ఖాన్ పరిశీలించారు. నిర్మాణపరుడు వేగవంతంగా చేయాలని వారు సూచించారు. సర్పంచ్ మాక్నూరు వరలక్ష్మి, ఉప సర్పంచ్ రాంరెడ్డి, కార్యదర్శి మహేందర్ సింగ్తో పాటు నాయకులు ముత్యం రెడ్డి, సాయన్న, భూషణ్ రెడ్డి పాల్గొన్నారు.