కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పాడిపంటలు సమృద్ధిగా పండేలా అమ్మవారు ఆశీర్వదించాలని కోరారు.