NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు, గ్రామంలోని సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.