SDPT: నాడైనా నేడైనా ఎప్పుడైన అన్నింటా అగ్రగామి సిద్దిపేటనే అని హరీశ్ రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 300 మందికి రూ.63 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం పొందిన నియోజకవర్గం సిద్దిపేట అన్నారు. సిద్దిపేటలో ఇప్పటి వరకు 12,857 మందికి రూ.41.13 కోట్లు ఆర్థిక సాయం అందజేశామన్నారు.