నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారట. ఇటీవలే విజయ్ వినిపించిన కథకు బాలయ్య ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పినట్లు సమాచారం. 2027 ప్రారంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.