MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డులోని అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు అలీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కోరారు. బుధవారం బెల్లంపల్లి MRO కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి వార్డులో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వివరించారు. పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌కు విన్నవించారు.