AP: మాజీ సీఎం జగన్ రాజధానిపై చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. రాష్ట్రాలకు రాజధాని అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదన్న జగన్.. మరి ‘మావిగన్’ అనే పేరును ఎందుకు సూచించారని నెటిజన్లు ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధానే అవసరం లేనప్పుడు ‘మావిగన్’ ఎందుకని కామెంట్లు చేస్తున్నారు. ఇదే జగన్ గతంలో మూడు రాజధానులు ఎందుకు ప్రకటించారో చెప్పాలంటున్నారు.