AKP: ఎలమంచిలి, కోటవురట్ల, మాకవరపాలెం మండలాల సరిహద్దుల్లో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పెదపల్లి అటవీ ప్రాంతంలో డ్రోన్‌తో నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి అక్రమ రవాణా నిరోధానికి, పేకాట కోడిపందాలు తదితర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.