NGKL: పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి నియోజకవర్గంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా డోర్నకల్ -గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.