VKB: జిల్లాకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ద్రోని గాలి ఉపరితల చక్రవకం ప్రభావంతో జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.