AKP: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను బుధవారం నుంచి అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో రాంబిల్లి మండలం పెదకలువలాపల్లి, వై.లోవ గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సీఐటీయూ మండల కన్వీనర్ దేవుడు నాయుడు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్‌గా మార్చడం అన్యాయం అన్నారు.