MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామపంచాయతీలలో రేపు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీల వద్ద ఈ సభలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చ ఉంటుందన్నారు.గ్రామ సభకు హాజరు కావాలని సూచించారు.