SKLM: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో మందుబాబులు చల్లని బీర్లవైపుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి నెల నుంచి మద్యం కంటే బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. జిల్లాలో నెలకు రూ.90 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండగా, అందులో బీర్ల విక్రయాలే అధికంగా జరిగాయి. కాగా, జిల్లాలో 185 మద్యం షాపులు, 20 బార్లు ఉన్నాయి.