GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై బుధవారం DSO స్వామి కుమార్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 9 డొమెస్టిక్ LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు గృహ సిలిండర్లను వాడుతూ ప్రభుత్వానికి గండి కొడుతున్న 7 మంది యజమానులపై కేసులు నమోదు చేశారు.