కోనసీమ: మండపేట పురపాలక సంఘం 2025-26 సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. మార్చి 31 అర్ధరాత్రి నాటి నివేదిక ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మండపేట రెండవ స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో వినుకొండ(పల్నాడు జిల్లా) ప్రథమ స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలో రాజం(విజయనగరం జిల్లా) నిలిచాయి.