VZM: విజయ భావన సాహితీ మిత్ర సమాఖ్య 41వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. గోపాలరావు పేర్కొన్నారు. ఈ నెల 19న ఉగాది, సంస్థ 41వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ వెల్ఫేర్ క్లబ్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా పలువురికి పురస్కారం అందజేయనున్నామని తెలిపారు.