WNP: జిల్లాలో ప్రభుత్వ అవసరాలకు, గృహ నిర్మాణానికి ఇసుక సరఫరాకు ఏప్రిల్ 1 నుండి ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి మాన్యువల్ కూపన్లు జారీ చేయరాదని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మాన్యువల్ కూపన్లు ఇసుక సరఫరాకు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.