BDK: బూర్గంపాడు మండలం సారపాక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా రోజురోజుకు పెరుగుతూ నియంత్రణ తప్పుతోంది. ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) లేకుండా ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలు దోచుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.