KNR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాయి. గతంలో సాధించిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక వ్యతిరేకమని విమర్శించాయి. ఇవి అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత తగ్గి, సంఘాల హక్కులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశాయి.