KDP: జమ్మలమడుగులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో, సుగమంచిపల్లికి చెందిన మహమ్మద్ భాషాకు కడప పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ విశ్వనాథ్ అభినందించారు.