NZB: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కలెక్టరేట్లో బుధవారం సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2011లో చివరిసారిగా జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియలు చేపట్టాల్సి ఉండగా.. కరోనా వల్ల నిర్వహించలేదన్నారు.