ప్రకాశం: కంభం మండలంలోని స్వర్ణగ్రామాన్ని ఎంపీడీఓ వీరభద్రాచారి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూఎఫ్ సర్వేకు సంబంధించి ఇంకా పూర్తి కాకుండా ఉన్న 65 గృహాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఎంపీడీఓ సిబ్బందిని ఆదేశించారు.