CTR: చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా బుధవారం పలమనేరు రోడ్డులోని భవన యజమానుల అంగీకారంతో సొంత భవనాలను తొలగించారు. భవన యజమానులు సహకరించారని, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తెలిపారు. విస్తరణ పనులను ఆయన పర్యవేక్షించారు. పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది పాల్గొన్నారు.